
వాహనాలు కొనసాగించాలి
గతప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగిస్తూనే ఎండీయూ వాహనాలను ఏవిధంగా నడిపిందో ప్రస్తుత ప్రభుత్వం రేషన్ వాహనాలను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాపంపిణీ వ్యవస్థపై చిత్త శుద్ది ఉంటే కేరళ రాష్ట్రంలో వలే 16 రకాల వస్తువులను ప్రజలకు అందించాలి.
– పి.కిషోర్,
ఏఐటీయూసీ జిల్లా నాయకుడు
కేవలం 244 కేసులు మాత్రమే
ఎండీయూ వ్యవస్థ ప్రవేశ పెట్టిన గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు కేవలం 244 మాత్రమే. అదే రేషన్ డీలర్ల వ్యవస్థపై 60 వేల కేసులు ఉన్నాయి. ఒక్క ఎండీయూ ఆపరేటర్ ముగ్గురు రేషన్ డీలర్ల పని చేస్తున్నాడు. ఈ వ్యవస్థ ఉంటేనే ప్రజలకు ఇంటింటికి రేషన్ సక్రమంగా అందుతుంది.
– ఎస్.జయరాజు, జిల్లా అధ్యక్షుడు,
ఎండీయూ ఆపరేటర్ల యూనియన్,
ఉచితంగా బియ్యం సరఫరా
2023–2025 వరకు ఎండీయూ వాహనాల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా సొంత ఖర్చులతో బియ్యం సరఫరా చేశాం. దీనికి సంబంధించి ఎలాంటి అదనపు వేతనాలు చెల్లించలేదు. ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రి మమ్మల్ని రోడ్డున పడేశారు.
– బి.సుబ్బారావు,
ఎండీయూ ఆపరేటర్, నాచుగుంట
మరో 20 నెలలు కొనసాగించాలి
గతంలో ఎండీయూ వ్యవస్థ ప్రారంభమైన రోజుల్లో ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2027 జనవరి వరకు ఎండీయూ వ్యవస్థను కొనసాగించాల్సిందే. లేనిపక్షంలో మేం చెల్లించాల్సిన 20 ఈఎంఐల బకాయిల మొత్తాన్ని రద్దుచేసి ఎన్‌ఓసీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం అందించాలి.
– ఘంటా మాధవరావు,
వెంకట కృష్ణాపురం, ద్వారకాతిరుమల మండలం
ప్రాణాలకు తెగించి సేవలు
కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందించిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్ల ఉపాధికి గండి కొట్టడం సిగ్గుచేటు. ఇంటింటికి రేషన్ వద్దు.. మద్యం ముద్దు అన్న చందంగా ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గం. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచిపని నేడు కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు.
– దూలం నాగేశ్వరరావు,
జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ, ఏలూరు జిల్లా
●

వాహనాలు కొనసాగించాలి

వాహనాలు కొనసాగించాలి

వాహనాలు కొనసాగించాలి

వాహనాలు కొనసాగించాలి