
ఇబ్బందులు పెట్టడం సరికాదు
పత్రికలు ప్రభుత్వాలు అనుసరించే లోపభూయిష్ట విధానాలపై కథనాలు ఇవ్వడం పరిపాటి. వాటిని దృష్టిలో పెట్టుకుని లోపాలను సరిచేసుకుని సుపరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతేకాని లోపాలు, అవినీతిపై కథనాలు రాసిన వారిని ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఇటువంటి చర్యలతో ప్రభుత్వం ప్రజాదరణకు దూరమవుతుంది.
– కోలా భాస్కరరావు, వివేకానంద ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
పత్రికా విలేకరులు, ఎడిటర్లపై ప్రభుత్వమే దాడులు చేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇటువంటి చర్యల ద్వారా సాధారణ పౌరులు కూడా ప్రతి దాడులకు తెగించవచ్చనే మెసేజ్ వెళుతుంది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలు మంచిది కాదు.
–చిక్కా భీమేశ్వరరావు, సీనియర్ న్యాయవాది
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పత్రికలపై దాడులు అమానుషం, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికలపై పోలీసులే దాడులకు దిగడం దుర్మార్గ చర్య. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే అక్కసుతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ దాడులకు దిగడం తగదు.
– మెండెం సంతోష్‌కుమార్, ఎస్సీ సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తీవ్రంగా ఖండిస్తున్నాం
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంపై దాడులను ఏపీ యూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తోంది. పత్రికా రంగంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే నెపంతో పత్రికలు, పాత్రికేయులపై వేధింపులు, అక్రమ కేసులకు పాల్పడితే సహించం. సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. దాడులు వెంటనే ఆపాలి.
– వాసా సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్
కక్ష సాధింపు తగదు
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడటం, తొలుతగా ఎటువంటి నోటీసులివ్వకుండా ఇంట్లో సోదాలు నిర్వహించడం కూటిమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలుగా భావించాలి. వీటిని తాము ఖండిస్తున్నాం. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయి.
– మెరిపో జాన్ రాజు, కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు
అందరూ ఖండించాలి
ప్రభుత్వ లోపాలను ప్రశ్నించేవారిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. చట్టప్రకారం, ప్రజాస్వామ్య పద్ధ్దతిలో పోలీస్ అధికారులు వ్యవహరించాలి. కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం వీడాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరుతున్నాం.
– గెడ్డం రవీంద్రబాబు, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శి

ఇబ్బందులు పెట్టడం సరికాదు

ఇబ్బందులు పెట్టడం సరికాదు

ఇబ్బందులు పెట్టడం సరికాదు

ఇబ్బందులు పెట్టడం సరికాదు

ఇబ్బందులు పెట్టడం సరికాదు