
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలి
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, 12వ పీఆర్‌సీ అమలు, మూడు పెండింగ్ డీఏల మంజూరు, ఐఆర్‌ల విడుదల కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయబోతున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, ఈ వ్యవస్థను అమలు చేస్తే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అవుతుందన్నారు. జిల్లా కార్యదర్శి యూవీ నరసింహారాజు, జిల్లా ఉపాధ్యక్షులు జేఎస్ శాస్త్రి, గణేష్, డీకేఎస్‌ఎస్ ప్రకాష్‌రావు, ఎన్.రమాదేవి మాట్లాడారు. జిల్లా ఆడిట్ కమిటీ బాధ్యుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.