
ధ్వజారోహణం.. దేవతాహ్వానం
అట్టహాసంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు చరాచర సృష్టిని ఆహ్వానిస్తూ గురువారం రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ వే డుక నేత్రపర్వమైంది. అర్చకులు శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. ఉదయం ఆలయంలో ఉత్సవ నిత్యహోమ గ్రామ బలిహరణలు, వేద స్వస్తి, సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారు మత్స్యావతార అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అంకురార్పణ జరిగిందిలా..
సాయంత్రం ఆలయంలో ఒక వాహనంపై విష్వక్సేనుని ఉంచి అలంకరించారు. అనంతరం అర్చ కులు పుట్టమన్నును తెచ్చి, ఆలయ ఆవరణలో ఏ ర్పాటు చేసిన పాలికల్లో ఉంచారు. అనంతరం అంకురార్పణ జరిపించారు. గరుడ పటాన్ని ఎగురవేసి భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంచిపెట్టారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం 7 గంటల నుంచి.. సూర్యప్రభ వా హనంపై గ్రామోత్సవం
● ఉదయం 7 గంటల నుంచి.. భజన కార్యక్రమాలు
● సాయంత్రం 5 గంటల నుంచి.. హరికథ
● రాత్రి 7 గంటల నుంచి.. చంద్రప్రభ వాహనంపై తిరువీధి సేవ
● రాత్రి 9 గంటల నుంచి.. సురభి నాటక ప్రదర్శన
● శ్రీవారి ప్రత్యేక అలంకారం : శ్రీరామ