
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఈ నెల 12 నుంచి 20 వరకు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి ఏడాది పరీక్షలకు జనరల్, ఒకేషనల్‌లో 10,068 మంది, రెండో సంవత్సరం జనరల్, ఒకేషనల్ కోర్సులకు 3,035 మంది పరీక్షలు రాసేందుకు 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో 08812230197 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్‌ఐఓ కె.యోహాన్, డీఐఈవో టి.శేఖర్ బాబు, డీపీవో కె.అనురాధ, ఆర్‌టీసీ డీఎం బి.వాణి, కొయ్యలగూడెం, కుక్కునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎల్.శ్యామ్ కుమార్, కె.శ్రీనివాసరావు, విద్యుత్, పోస్టల్ అధికారులు పాల్గొన్నారు.
పౌర రక్షణ చర్యలు బలోపేతం కోసం..
దేశంలో పౌర రక్షణ చర్యలను బలోపేతం చేసే దిశగా.. జిల్లాలో ముందస్తుగా భద్రతపై మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పోలీసు, రెవెన్యూ, భద్రతా, అత్యవసర సేవ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సివిల్ మాక్ డ్రిల్ అంశంపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సంబందిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.