
రెడ్ క్రాస్.. సేవలు భేష్
●
రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరండి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లాశాఖలో సభ్యులుగా చేరండి. ఇప్పటికే తలసేమియాతో చిన్నారులకు రక్తదానం చేయిస్తున్నాం. దాతలు ముందుకొచ్చి అందించే సాయం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జిల్లా కలెక్టర్ సహకారంతో రెడ్ క్రాస్ సేవలను మరింతగా విస్తరిస్తాం.
– డాక్టర్ ఎంబీఎస్‌వీ ప్రసాద్, చైర్మన్, రెడ్ క్రాస్ ఏలూరు జిల్లా
సేవా భావంతో పనిచేస్తున్నాం
ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావించాలి. రెడ్ క్రాస్ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ప్రకృతి విప్తతుల సమయంలో నిరాశ్రయులైన బాధితులకు రెడ్ క్రాస్ ద్వారా సేవలు అందించాం. ప్రధానంగా వేలేరుపాడు, కుక్కునూరు వరద బాధితులకు వంట సామాగ్రి, పరజాలు పంపిణీ చేశాం. రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలి.
– ఆలపాటి నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, ఏలూరు
కై కలూరు: యుద్ధాలు, విపత్తులు, ఆరోగ్య సంక్షోభం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అపన్న హస్తాన్ని అందించి రెడ్ క్రాస్ అందరీ మన్ననలు అందుకొంటోంది. అభాగ్యులు.. అనాథలు.. ఆకలితో అలమటించే శరణార్థులకు చేయూతనందిస్తోంది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా గురువారం ‘మానవత్వాన్ని సజీవంగా ఉంచడం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్న కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే రక్తదానం, ర్యాలీ కార్యక్రమాలు ఉదయం ప్రారంభించనున్నారు.
సేవా కార్యక్రమాల్లో ముందంజ
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లాశాఖ సేవా కార్యక్రమాల్లో ముందుంటోంది. సొసైటీలో మొత్తం 800 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి తలసేమియా సెంటర్‌ను ఏలూరులో ఏర్పాటు చేశారు. తలసేమియా, సికిల్‌సెల్, ఎనీమియా పిల్లలు మొత్తం 375 మందికి ల్యూకో సైట్ డిప్లేటెడ్ ఫిల్టర్ సెట్లు ద్వారా రక్తమార్పిడి చేస్తున్నారు. 2024–25 ఏడాదిలో 650 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఉచిత మందులతో పాటు రోగులు, బంధువులకు భోజనాలు సమకూరుస్తున్నారు. పత్తేబాద్ రెడ్‌క్రాస్‌లో 80 మంది మహిళలకు రెండేళ్లపాటు ఎంపీహెచ్‌డబ్ల్యూ మహిళా శిక్షణ కళాశాల ద్వారా హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లును తయారు చేసి సేవా భావాన్ని పెంపొందిస్తున్నారు.
రక్తదానంలో కీలకపాత్ర
రెడ్ క్రాస్ సేవలు 7 ముఖ్యమైన సూత్రాలతో ఆధారపడి ఉంటాయి. మానవత్వం, నిష్పాక్షికత, తటస్థత, స్వాతంత్య్రం, స్వచ్ఛంద సేవా, ఐక్యత, సార్వత్రికత వీటిలో ఉన్నాయి. ఏలూరు జిల్లాశాఖ కోవిడ్–19, ఇటీవల వరదల సమయంలో అనేక సేవలు అందించారు. వేలేరుపాడు, కుక్కునూరు వరద బాధితులకు 33 కిచెన్ సెట్లు, 200 దప్పుట్లు, 250 పరజాలు అందించారు. ముఖ్యంగా తలసేమియా, సికిల్‌సెల్, ఎనీమియా చిన్నారులకు రక్తదానం అందించడంలో ఏలూరు జిల్లా రెడ్ క్రాస్ కీలకపాత్ర వహిస్తోంది.
నేడు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం
సేవా కార్యక్రమాల్లో ముందున్న ఏలూరు జిల్లా
తలసేమియా, సికిల్‌సెల్, ఎనీమియా రోగులకు రక్తదానం
కోవిడ్–19, వరద బాధితులకు సాయంలో ముందంజ
నేడు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు

రెడ్ క్రాస్.. సేవలు భేష్

రెడ్ క్రాస్.. సేవలు భేష్

రెడ్ క్రాస్.. సేవలు భేష్

రెడ్ క్రాస్.. సేవలు భేష్