
ప్రైవేట్ బస్సును ఢీకొన్న బైక్
పెనమలూరు: ప్రైవేటు బస్సును మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరోకరు గాయపడ్డారు. పెనుమూలూరు మండలంలోని పోరంకి సెంటర్‌లో విజయవాడ–మచిలీపట్న ం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. నూజివీడు హజరయ్యపేటకు చెందిన కలపాల బోస్, ఎం.కృష్ణతారక్ (35) పెయింటర్లు. ప్రస్తుతం పెనమలూరు మండలంలోని తాడిగడప శ్రీనగర్‌కాలువ కట్ట వద్ద నివసిస్తున్నారు. పెయింటింగ్ పనుల కోసం మంగళవారం రాత్రి ఇద్దరు బైక్‌పై పెనమలూరు సెంటర్‌కు వెళ్లారు. పని ముగించుకోని రాత్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా పోరంకి సెంటర్‌కు వచ్చేసరికి ముందు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఆగగా వీరి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌ను నడుపుతున్న కృష్ణతారక్, వెనక కూర్చున్న బోసుకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణతారక్ మృతి చెందాడు.
ఒకరి మృతి.. మరొకరికి గాయాలు