
గ్రామంలోని మంచినీటి చెరువు పక్కనే ఉన్న ఎస్సీ కాలనీకి డ్రెయినేజీ సదుపాయం లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇళ్లలోని వాడకం నీరు రోడ్డుపైకి వచ్చి నడవడానికి వీలుండేది కాదు. మా ప్రాంతానికి వచ్చిన పీవీఎల్ నర్సింహరాజుకు సమస్య తెలుపగా నిధులు మంజూరు చేసి పక్కా డ్రెయిన్ నిర్మించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఎస్సీ కాలనీకి ఇన్నేళ్లకు న్యాయం జరిగింది.
– పిల్లి లూథియమ్మ, సిద్ధాపురం, ఆకివీడు మండలం
మట్టి రోడ్డు నుంచి సీసీ రోడ్డు
మా వీధిలో చాలాకాలంగా మట్టి రోడ్డు మాత్రమే ఉండటంతో రాకపోకలకు చాలా ఇబ్బంది పడేవాళ్లం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మా వీధికి వచ్చిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు సమస్యను వివరించగా ఆయన వెంటనే స్పందించి రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. రూ.15 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేశారు.
– కోళ్ల జయ కనకదుర్గ, చిట్టవరం, నరసాపురం మండలం
అడిగిన వెంటనే రోడ్డు నిర్మించారు
జీజీఎంపీలో భాగంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సజ్జాపురం ఎల్‌ఐసీ వీధిలోకి వచ్చినప్పుడు స్థానికులమంతా మా ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేయించాల్సిందిగా కోరాం. రూ.25 లక్షల నిధులతో వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేయడం, ఇటీవల ప్రారంభించడం కూడా జరిగిపోయాయి. అడిగిన వెంటనే రోడ్డు నిర్మించినందుకు ఆయనకు కృతజ్ఞతలు.
– సీహెచ్ హనుమంతరావు, సజ్జాపురం, ఎల్‌ఐసీ వీధి
సమస్యలు పరిష్కారమయ్యాయి
జీజీఎంపీలో నాయకులు, అధికారులు ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. మేము నివాసం ఉంటున్న ఆది ఆంధ్ర పేటలో రోడ్డు సమస్య గురించి వారికి తెలియజేశాం. ఆ తర్వాత మా ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించారు. గ్రామ శివారులైన చినపాలెం, పెద్దపాలెం, బొల్లేటిగుంట ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మించడంతో గ్రామంలో చాలావరకు రోడ్ల సమస్య పరిష్కారమైంది.
– యల్లమెల్లి రాంబాబు మట్టపర్రు, పోడూరు మండలం
●


