
ఎస్‌జీఎఫ్ పోటీలు
స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ జిల్లాస్థాయి పోటీలు పెదవేగిలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 8లో u
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ఏలూరు(మెట్రో): డిసెంబర్ 31 నాటికి ఫైనల్ ఆర్‌వోఆర్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి కలెక్టర్ల, జాయింట్ కలెక్టర్లతో రీ సర్వే అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి హాజర య్యారు. ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి రీ సర్వే పూర్తి చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి భూహక్కు పత్రాలను కూడా పంపిణీ చేయాలన్నా రు. అలాగే ఫైనల్ ఆర్‌వోఆర్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు పత్రాల పంపిణీకి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శనివారం నాటికి ఫేజ్–2 కింద పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఫేజ్–2 కింద పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాలు త్వరితగతిన పంపిణీ పూర్తి చేస్తామని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శికి వివరించారు.