● నీట్‌గా నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

● నీట్‌గా నిర్వహణ

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 3,341 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3,242 మంది హాజరయ్యారని కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 99 మంది హాజరు కాలేదన్నారు. అభ్యర్థుల కోసం రాజమహేంద్రవరం అర్బన్‌లో ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌కేవీటీ ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ హైస్కూల్‌, ఓఎన్‌జీసీ బేస్‌ కాంప్లెక్స్‌లోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ గర్‌ల్స్‌ హైస్కూల్‌తో పాటు నెహ్రూ నగర్‌, దానవాయిపేటల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే, రాజానగరం వద్ద ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల, కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సౌకర్యాలను, పరీక్షల నిర్వహణను రాజమహేంద్రవరం ఇన్‌చార్జి ఆర్‌డీఓ కె.ఆనందరావు పరిశీలించారు.

– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

Advertisement
 
Advertisement
Advertisement