ఆత్రేయపురం: ర్యాలి గ్రామ శివారు అంకంపాలెం బంగారం తల్లి గుడి సమీపంలోని పీచు ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు రూ.కోటి విలువైన ఫ్యాక్టరీ పూర్తిగా కాలిపోయింది. పవన్ కాయర్ ప్రొడక్ట్ పేరుతో ర్యాలి గ్రామానికి చెందిన రుద్రరాజు సూర్యనారాయణరాజు ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు రేగాయి. పనిచేస్తున్న సిబ్బంది, స్థానికులు వాటిని గుర్తించి, అదుపు చేసే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీలోని పీచుమెషీన్లు, తయారుచేసిన పీచు బండిళ్ల, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.


