స్క్వాష్‌ క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

స్క్వాష్‌ క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగే జాతీయ స్ధాయి స్వ్కాష్‌ పోటీలలో పాల్గొనే రాష్ట్ర అండర్‌ – 14, 17 జట్లకు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ కిట్లు పంపిణీ చేశారు. కాకినాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో డీఈవో రమేష్‌ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో రాణించి రాష్ట్రానికి, జిల్లాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాకినాడ ఉప విద్యాశాఖ అఽధికారి కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల్లో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అడ్మిన్‌ కార్యదర్శి పి.సుధారాణి, కోచ్‌, మేనేజర్లు కె.మంగయమ్మ, జి.సునీల్‌ కుమార్‌, జి.సత్యానందం, స్కూల్‌ గేమ్స్‌ అసిస్టెంట్‌ కార్యదర్శి పరశురాం తదితరులు పాల్గొన్నారు.

జట్ల వివరాలు

అండర్‌ 14 (బాలురు): ఏ.ప్రభు కిరణ్‌, ఎం.వీర వెంకట రమణ, జి.కార్తికేయ, వి.సిద్ధిశ్రీ, జి.శశాంక్‌ రెడ్డి, కోచ్‌ జి.సునీల్‌ కుమార్‌, మేనేజర్‌ జి.సత్యానందం.

● అండర్‌–14 (బాలికలు): పి.బెస్సీ షారోన్‌, జి.మహాలక్ష్మి, కె.సాహితీ మేఘన, జి.స్తుతి కీర్తన, టి.రమ్యశ్రీ, కోచ్‌ కె.మంగయమ్మ, మేనేజర్‌ పి.సుధారాణి.

అండర్‌–17 (బాలురు): ఐ.తనీష్‌ రాజ్‌, బి.సూరజ్‌, బి.అశ్విక్‌, టి.వెంకట చంద్రసాయి సాకేత్‌, బి.సురేష్‌, కోచ్‌ బి.సురేష్‌ రాజు, మేనేజర్‌ జి.సునీల్‌ కుమార్‌.

అండర్‌–17 (బాలికలు): పి.సూర్యలక్ష్మీ అభిజ్ఞ, నల్లమిల్లి ఐశ్వర్య రెడ్డి, నడింపల్లి రూపశ్రీ, ఎం.తేజశ్విని, రాగం మేణు, కోచ్‌ పి.సుధారాణి, మేనేజర్‌ కె.మంగయమ్మ, హెచ్‌ఓడీ ఎస్‌కే మహబూబ్‌ బాషా.

Advertisement
 
Advertisement
Advertisement