ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

ప్రతి కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగియగానే రాష్ట్ర ఎస్‌పీడీ కార్యాలయం ఆ దరఖాస్తులను పరిశీలన చేసి ప్రవేశాన్ని నిర్ణయిస్తుంది. పేద విద్యార్థినులకు కేజీబీవీలో ప్రవేశం ఒక సువర్ణావకాశం. చదువు, ఆటపాటల్లో కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.

జి.నాగమణి,

ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ.

సద్వినియోగం చేసుకోవాలి

కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు కల్పించే అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు కార్పొరేట్‌ తరహా విద్యను ఇక్కడ అందిస్తున్నారు. బాలికలకు భద్రతతో కూడిన విద్యాబోధన లభిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. సీసీ కెమెరాలు, భద్రతా వలయం మధ్య విద్యార్థినులకు విద్యను అందిస్తున్నారు.

పి.ఉమామహేశ్వరి, జీసీడీవో,

సమగ్ర శిక్షా, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement