స్థలాల ఎంపికపై నిర్వాసితుల అభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

స్థలాల ఎంపికపై నిర్వాసితుల అభిప్రాయ సేకరణ

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

చింతూరు: గిరిజనేతర నిర్వాసితులకు స్థలాల ఎంపిక నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం అభిప్రాయ సేకరణ చేపట్టారు. రెండో ఆప్షన్‌లో భాగంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకొనే నిర్వాసితులకు తాడువాయిలోని 12వ నంబరు బ్లాకు, లేదా మూడో నంబర్‌ బ్లాకులలో ఏది కావాలో అనే అంశంపై అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు.

గతంలో తమ అభిప్రాయాలు తెలిపిన వారు సైతం ప్రస్తుతం తమ అభిప్రాయాలు మార్చుకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. చింతూరుకు చెందిన గిరిజన నిర్వాసితులు తమకు ఏ బ్లాకులో ప్లాట్‌ కావాలో స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement