● 34గ్రాములు బంగారం స్వాధీనం
● బాధితులకు అప్పగించిన పోలీసులు
జగ్గంపేట: గ్రామానికి చెందిన ఒక మహిళ ఆటోలో వదిలేసిన 34 గ్రాముల బంగారాన్ని ఫిర్యాదు చేసిన మూడు గంటల వ్యవధిలో పోలీసులు వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించారు. మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల లలిత హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి రైలులో శుక్రవారం సామర్లకోట వచ్చారు. అక్కడి నుంచి జగ్గంపేటకు ఆటోలో వెళ్లి దిగేటపుడు తన బ్యాగ్‌ను మరచిపోయారు. అందులో రూ.4.5 లక్షల విలువైన 34 గ్రాముల బంగారు వస్తువులు మరచిపోయారు. కొద్దిసేపటికే ఆ విషయం గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో జగ్గంపేట సెంటర్ నుంచి సామర్లకోట వెళ్లే దారిలో సీసీ కెమేరాల ఫుటేజీలన పరిశీలించి కాట్రావులపల్లి శివార్లలో ఆటోను గుర్తించి పట్టుకున్నారు. ఆటోలో బ్యాగ్ తీసుకుని పరిశీలించి బంగారం వుండడంతో వాటిని సురక్షితంగా భాదితురాలు లలితకు అందజేశారు. పోలీసులకు లలిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


