అమలాపురం టౌన్: విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల 4,5 తేదీల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ మెన్ చాంపియన్ షిప్ పోటీల్లో కోనసీమ జిల్లా టీమ్ (జట్టు) విన్నర్‌గా నిలిచి చాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. ఈ పోటీల్లో అమలాపురం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్‌కు చెందిన పవర్ లిఫ్టర్ జె.జితేంద్ర దొర రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ రన్నర్ అప్‌ను సాధించాడని ఆ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. జితేంద్రతోపాటు జి.దినేష్ ప్రసాద్, కె.వరుణ్, కె.నాని, వి.సోమశేఖర్, వి.గోపి, బి.అప్పన్న, వై.ఇందిర, పి.వందన ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయి పతకాలను గెలుచుకున్నారన్నారు. స్థానిక జిమ్‌లో మంగళవారం ఉదయం జరిగిన అభినందన సభలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీల విజేతలను క్రీడా ప్రతినిధులు, జిమ్ ప్రతినిధులు ప్రశంసించారు.


