అమలాపురం టౌన్: వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభల కర పత్రాలను అమలాపురం సర్ సీవీ రామన్ స్కూలులో ఆ సంఘం ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. మహాసభలు అమలాపురంలోని గంగరాజు ఫంక్షన్ హాలులో మే 6,7,8 తేదీల్లో జరుగుతాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు వెల్లడించారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన నాయకత్వ ప్రతినిధులు హాజరవుతారని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రాష్ట్ర మహా సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా రవణం వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా సూదా గణపతి, ప్రధాన కార్యదర్శిగా కారెం వేంకటేశ్వరరావులు వ్యవహరిస్తున్నారు.


