● శ్రీనివాసా.. శ్రీవేంకటేశా | - | Sakshi
Sakshi News home page

● శ్రీనివాసా.. శ్రీవేంకటేశా

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి దివ్య దర్శనం పరమ పావనమే.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి శనివారం అశేష భక్తజనం వచ్చారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఏడు శనివారాల స్వామివారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తూ, ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ.76.26 లక్షల ఆదాయం వచ్చింది. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు తదితరులు పర్యవేక్షించారు.

–ఆత్రేయపురం

Advertisement
 
Advertisement
Advertisement