ఉరేసుకుని కార్మికుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని కార్మికుడి ఆత్మహత్య

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

సామర్లకోట: ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు పెద్దాపురం శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఆ రోడ్డులో వెళుతున్న ప్రయాణికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై వి.మౌనిక తన సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. మృతుడు షిఫ్‌రూప్‌ (50) ఒడిశా నుంచి వచ్చి పెద్దాపురం రోడ్డులో వాలుతిమ్మాపురంలోని ఓ రైస్‌మిల్లులో కూలిగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై మౌనిక తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవర్‌ దుర్మరణం

జగ్గంపేట: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగ్గంపేటకు చెందిన రాయి చక్రవర్తి (35) డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. శనివారం ఉదయం జగ్గంపేట శివారులో ఉన్న లారీ యూనియన్‌ ఆఫీస్‌కు వెళ్లి తిరిగి వెనుక నుంచి లారీ ఢీకొంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement