● ల్యాప్‌టాప్ మరచి దిగిపోయిన
ప్రయాణికురాలికి అందజేత
● ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచుతుందన్న డీఎం జేమ్స్ కుమార్
రాజోలు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ల్యాప్‌ట్యాప్ మరచి దిగిపోయిన ప్రయాణికురాలికి తిరిగి అందజేసిన కండక్టర్ రాజుకు స్థానిక డీఎం జేమ్స్ కుమార్ శనివారం అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళి తే, అమలాపురం నుంచి కరవాకకు బస్సులో ప్రయా ణిస్తున్న జె.శ్రావణి బస్సు దిగుతూ ల్యాప్‌ట్యాప్ మరచిపోయారు. దీనిని గమనించిన కండక్టర్ ఎన్.జి.రాజు దానిని భద్రపరిచి, డిపో మేనేజరు జి.జేమ్స్ కుమార్, సూపర్‌వైజర్ సమక్షంలో ఆమెకు అప్పగించారు. కండక్టర్ నిజాయతీ, బాధ్యతాయుత సేవలను డీఎం కు మార్ అభినందించారు. ఈ ఘటన ప్రజల్లో సంస్థ పట్ల నమ్మకాన్ని పెంచడమే గాకుండా, ఏపీఎస్ ఆర్టీసీ సి బ్బంది సేవాతత్వాన్ని ప్రతిబింబింప చేస్తోందన్నారు.


