చిన్నారి శస్త్రచికిత్సకు ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి శస్త్రచికిత్సకు ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’

Mar 29 2026 7:18 AM | Updated on Mar 29 2026 7:18 AM

కాజులూరు: ఆర్యావటం గ్రామానికి చెందిన చిన్నారి పాదాలకు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సహకారంతో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. చిన్నారి పాదాలు వెనుకకు మెలి తిరిగి నడవలేని స్థితిలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసేందుకు కాకినాడ శ్రీకై రా ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్‌ వైద్యులు సిద్ధమవుతున్నారు. కరప మండలం ఉప్పలంకకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి కర్రి దుర్గాభవానికి పుట్టుకతోనే పాదాలు వెనుకకు మెలి తిరిగి ఉండటంతో నడచేందుకు వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి అనసూరి శ్రావణి హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త, సంస్థ చైర్మన్‌ జి.విఠల్‌రెడ్డిని సంప్రదించగా రూ.లక్ష అందజేశారు. అలాగే సంస్థ సభ్యులు మరో రూ.40 వేలు సమకూర్చారు. చిన్నారి కుటుంబ పరిస్థితి, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని గమనించిన కాకినాడ శ్రీకై రా ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్‌ వైద్యుడు వెంకట భార్గవ్‌ రూ.2.5 లక్షలకే ఆపరేషన్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. సంస్థ సభ్యులు సమకూర్చిన రూ.1.4 లక్షలకు తోడు మరో రూ.1.1 లక్షలు, ఖర్చుల నిమిత్తం మరో రూ.15 వేలను కాకినాడ ప్రియా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల అధినేత తాడి నరేంద్రకుమార్‌ శనివారం అందజేశారు. దీంతో బాలికకు ఆదివారం ఆపరేషన్‌ చేయనున్నట్టు వైద్యుడు వెంకట భార్గవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement