అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లకు వివిద రకాల పూలతో విశేష అలంకరణ చేయటంతో స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 12,500 మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కలెక్టర్‌ను కలసిన ఆర్‌ఐఓ
రాజమహేంద్రవరం సిటీ: తూర్పు గోదావరి జిల్లా రీజనల్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐఓ) గా బాధ్యతలు స్వీకరించిన ఐ.శారద శనివారం కలెక్టర్ కీర్తి చేకూరిని కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకూ కాకినాడ జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిగా విధులు నిర్వహించిన ఆమెను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జిల్లా ఆర్‌ఐఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డ్రైవర్లు నిబంధనలు పాటించాలి
రాజమహేంద్రవరం సిటీ: రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ అన్నారు. శనివారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిపోను సందర్శించి, అక్కడ శిక్షణ పొందుతున్న డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన నిర్వహించారు. రాజమహేంద్రవరం హుకుంపేటలోని డి–మార్ట్ సమీపంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంపత్‌కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ప్రణీత్‌కుమార్, ఉమామహేశ్వరరావు, ఆర్టీసీ డీఎం మాధవ్ పాల్గొన్నారు.
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు


