213 అర్జీల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజలు క్షేత్ర స్థాయిలో అర్జీలు సమర్పించేందుకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కీర్తి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 213 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసంబంధిత సమస్యలు, రేషన్ సరఫరా, రోడ్లు, శానిటేషన్ వంటి అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేశారనీ, ఆయా శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
జ్యూట్‌బ్యాగ్‌ల తయారీలో
ఉచిత శిక్షణ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):
స్థానిక ఆల్కాట్‌తోటలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 10వ తేదీ నుంచి జ్యూట్‌బ్యాగ్‌ల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తామని సంస్థ డైరెక్టర్ టి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలపరిమి తి 14రోజులు మాత్రమేనన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పదవ తరగతిమార్కుల జాబితా జిరాక్సు 2కాపీలు, 4 ఫొటోలు తీసుకురావాలన్నా రు. శిక్షణ, వసతి, భోజనం పూర్తిగా ఉచితమన్నా రు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్, బ్యాంక్ రుణం ఇస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి గల 19 నుంచి 45సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, రైల్వేస్టేషన్ రోడ్డు, ఆల్కాట్‌తోట, రాజమహేంద్రవరంలో సంప్రదించాలన్నారు. వివరాల కు 0883–2420242, 2428807, 9700765159 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
టిడ్కో ఇళ్ల రుణాలను కట్టలేం
– మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
సామర్లకోట: 2024 ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఇంటి లోన్లు రద్దు చేసి, టిడ్కో ఇళ్లు ఇస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, రుణాలు కట్టలేమని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రం అందజేశారు. రూ.500 కట్టిన వారికి ఉచితంగా ఇచ్చిన విధంగానే రూ.50వేలు, రూ.లక్ష కట్టిన వారికి ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇవ్వాలని, రుణాలు కట్టలేమని నినాదాలు చేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో హౌస్ డబుల్ బెడ్ రూమ్ ప్లాటుకు(430 చదరపు అడుగులకి) రూ.లక్ష, 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూముకు రూ.50వేలు కట్టామని తెలిపారు. రూ.500 కట్టిన వారికి బ్యాంకు లోన్ రద్దు చేశారని చెప్పారు. ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నా అనేక మందికి ప్లాట్లు స్వాధీనం చేయలేదన్నారు. అప్పు చేసి కట్టిన సొమ్ముకు వడ్డీలు, ఇంటికి అద్దెలు చెల్లించవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇళ్లు ఇచ్చారని, తమకు ఇళ్లను స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు ఎ దుర్గలక్ష్మి, ఎ ఈశ్వరీ, డి లక్ష్మీ, కె రాజకుమారి, సత్యవతి నాయకత్వం వహించారు.


