21న పల్స్ పోలియో
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ఆనం కళాకేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.శ్రీదేవి మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సిబ్బందికి పలు సూచనలిచ్చామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలు లక్ష్యంగా గుర్తించగా, దీనికి 1,084 పోలియో బూత్‌లు, 62 ట్రాన్సిట్, 53 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 4,566 మంది సభ్యులు, 116 మంది సూపర్‌వైజర్లు, 10 మంది మానిటరింగ్ అధికారులను నియమించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు సీ్త్ర–శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, పురపాలక తదితర శాఖలు, వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ప్రయాణంలో ఉన్న వారికి ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సంధ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.షమ్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


