లోక్ అదాలత్‌కు 46 బెంచ్‌లు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఈ నెల 13న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచ్‌లు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడ దగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, యాక్సిడెంట్, బ్యాంకు, ప్రీ లిటిగేషన్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హై కోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలనా కేసులు కూడా ఇక్కడ పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు 18 వేల 35 కేసులను రాజీ చేయడానికి గుర్తించినట్టు తెలిపారు. న్యాయసేవ ప్రజల ముంగిటకు చేరాలన్న లక్ష్యంతో స్నేహపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమన్నారు.


