సారంగధరేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

సారంగధరేశ్వరుడు

Oct 22 2025 7:08 AM | Updated on Oct 22 2025 7:08 AM

సారంగధరేశ్వరుడు

సారంగధరేశ్వరుడు

రాజమహేంద్రిని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు వేంగి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడికి సారంగధరుడనే కుమారుడున్నాడు. రాజరాజ నరేంద్రుని రెండో భార్య చిత్రాంగి. ఆమెకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరిగిందని, దానిని నమ్మిన రాజు.. సారంగధరుని రెండు కాళ్లు, చేతులు తొలగించాలని ఆజ్ఞాపించాడని, ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్డులో ఉన్న కొండ మీద అతడికి ఆ శిక్ష విధించారని చెబుతారు. శిక్షకు గురైన సారంగధరుడు ఆర్తితో ప్రార్థించగా పరమ శివుడు ప్రత్యక్షమై సారంగధరేశ్వరుడికి కాళ్లు, చేతులు పునఃప్రసాదించారని, అక్కడ వెలసిన పరమేశ్వరునికే సారంగధరేశ్వరుడనే పేరు వచ్చిందని చెబుతారు.

ఫ ఇంకా నగరంలో శృంగేరి జగద్గురు శంకరమఠం, శారదా పీఠంలో వేంచేసియున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, గౌతమ ఘాట్‌ వద్ద నిర్మించిన రోటరీ మహాకాళేశ్వరాలయం (ఉజ్జయని ఆలయం) వంటి ప్రశస్తమైన ఆలయాలు ఈ నగరంలో కొలువు తీరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement