
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై బాలాజీ సుందరరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 18న సమిశ్రగూడెంలోని శ్రీనివాస మెడికల్ షాప్ వీధిలో ఉన్న దంగుల కొండమ్మ ఇంట్లో రూ.80 వేలు, 26 తులా ల వెండి, అరకాసు బంగారం, అలాగే కాలువ గట్టుపై కొండేపూడి సుధీర్‌కు చెందిన టీ టైంలో రూ.20 వేలు, ఆరు గ్రాముల బంగారం, ఒక సెల్‌ఫోన్ చోరీకి గురయ్యా యి. బాధితులఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరంలోని బాలాజీపేటకు చెందిన పల్లపాటి దుర్గాప్రసాద్‌తో మరో ఇద్దరు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కేసులో దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి రూ.50 వేలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై వివిధ జిల్లాల్లో 27 కేసులు ఉన్నాయి. కాగా.. దొంగను అరెస్ట్ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, టైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, జె.రెహ్మన్, జి.సాంబయ్య, రామశ్రీను, ధనుంజయ్‌లను ఎస్పీ డి.నరసింహ కిశోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ అభినందించారు.