
300 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
అమలాపురం టౌన్: ముమ్మిడివరం గేటు సెంటర్‌లోని శ్రీలలిత రైస్ స్టోర్స్‌పై మంగళవారం సివిల్ సప్లయిస్ అధికారులు దాడి చేశారు. ఆ షాపు యాజమాని రాంబాబు నుంచి 300 కేజీల (ఏడు బస్తాలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అతడిపై 6ఏ కేసు నమోదు చేశారు. సివిల్ సప్లయిస్ రాష్ట్ర డైరెక్టర్ కడలి ఈశ్వరి, జిల్లా కార్యాలయం ఏఎస్‌వో శరత్ సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. షాపులో రికార్డులను తనిఖీ చేసి, స్టాక్‌కు అదనంగా రేషన్ బియ్యం ఉన్నట్టు గమనించారు. రాంబాబు తన షాపులో అమ్మకం కోసం తరచూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తునట్లు గుర్తించారు.