
ప్రజలకు ఎస్పీ దీపావళి శుభాకాంక్షలు
ఎస్పీ నరసింహ కిశోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన ఈ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఐకమత్యం, సంతోషం నిండాలన్నారు. ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళిని సురక్షితంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు.
ఉత్సాహంగా ‘చెకుముకి’ పోటీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భీమయ్య, ఎన్.రవిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వివిధ పాఠశాలల్లో ఈ సంబరాలు నిర్వహించామన్నారు. నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి స్థాయిలో పాఠశాల స్థాయి సంబరాలకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. నవంబర్ 1న మండల, పట్టణ స్థాయిల్లో చెకుముకి పరీక్ష జరుగుతుందని, పాఠశాల స్థాయి విజేతలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు.

ప్రజలకు ఎస్పీ దీపావళి శుభాకాంక్షలు