
చీరమేను... అదిరేను
యానాం: గోదావరి నదీ ముఖ ద్వారాల వద్ద చీరమేను అధికంగా పడుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. పులస తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో వచ్చే చీరమేనుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉండటంతో మాంసాహార ప్రియులు చీరమేను కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా పడుతుండటంతో చీరమేనును కూరతో పాటు గారెలను సైతం వేసుకుంటున్నారు. స్థానికంగా ఓ కుటుంబం చీరమేనును గారెలుగా వేసి పలువురికి రుచి చూపించారు. గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు సైతం ప్రదర్శించారు.
అమ్మకాల జోరు
యానాం మార్కెట్‌లో చీరమేను అమ్మకాల సందడి నెలకొంది. సేరు, బకెట్, క్యారేజీ కొలతల్లో చీరమేను అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది సేర్ల బకెట్ రూ.18 వేలకు అమ్ముడుకాగా, అనంతరం చీకటి పడటంతో అదికాస్తా రూ.12 వేలకు దిగింది.
యానాం మార్కెట్‌కు విరివిగా చేపలు

చీరమేను... అదిరేను