హరిప్రియకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

హరిప్రియకు అభినందనలు

Oct 15 2025 5:56 AM | Updated on Oct 15 2025 5:56 AM

హరిప్రియకు  అభినందనలు

హరిప్రియకు అభినందనలు

అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన అంబాజీపేట జెడ్పీ హైస్కూల్‌ ఆరో తరగతి విద్యార్థిని కుడుపూడి కావ్య సుందరి హరిప్రియను మంగళవారం ప్రధానోపాధ్యాయుడు కడలి సాయిరామ్‌ అభినందించారు. బాపట్ల జిల్లా పేటేరు హైస్కూల్లో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 కేజీల విభాగంలో హరిప్రియ మొదటి స్థానంలో నిలిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. కార్యక్రమంలో పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరరావు, పీఈటీ అందె సూర్యకుమారి, కోచ్‌ త్రిమూర్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి మృతి

దేవరపల్లి: జాతీయ రహదారిపై యర్నగూడెం గండి చెరువు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలవరం మండలం కొత్తపట్టిసం గ్రామానికి చెందిన దొడ్డి నాగు (35) కొవ్వూరు మండలం పంగిడిలో నివాసం ఉంటున్నాడు. దొమ్మేరుకు చెందిన తాళ్ల అభిషేక్‌తో కలిసి నాగు బైక్‌పై విజయవాడలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. యర్నగూడెం సమీపంలో గండి చెరువు వద్ద హైవేపై వెళుతున్న క్వారీ లారీ సడన్‌గా సర్వీస్‌ రోడ్డులోకి వచ్చింది. దీంతో సర్వీస్‌ రోడ్డులో వెళుతున్న బైక్‌ అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొడ్డి నాగు తలకు బలమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అభిషేక్‌ తల, కాలికి బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అభిషేక్‌ అవివాహితుడు. నాగు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి సీఐ బీఎన్‌ నాయక్‌, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement