
నకిలీపై యుద్ధం
● నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చారు ● టీడీపీ నేతలే సూత్రధారులు
● దీనిపై సీబీఐ విచారణ జరపాలి ● వైఎస్సార్ సీపీ డిమాండ్ ● కలెక్టరేట్, ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద నిరసన
రాజమహేంద్రవరం రూరల్: మద్యపాన వ్యసనానికి ప్రజలను దూరం చేసి, వారి ఆరోగ్యాన్ని, తద్వారా సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, ఫుల్ కిక్ ఇచ్చే మద్యాన్ని అందిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో మందుబాబులకు వల వేశారు. వారి బలహీనతతో ఆటాడుకుని, ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను కూటమి నేతలకు కట్టబెట్టారు. తద్వారా వారికి ‘సంపద సృష్టించారు.’ అధిక ధరలకు మద్యం అమ్మకాలు మొదలుపెట్టి ఎడాపెడా దోచుకోవడం మొదలెట్టారు.. వీధివీధినా బెల్టు షాపులు తెరచి, మద్యం ఏరులై పారిస్తున్నారు. డోర్ డెలివరీ సైతం ఇస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ నేతలు విచ్చలవిడిగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు చేటుగా పరిణమించిన ఈ నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. రాజమహేంద్రవరంలో కలెక్టరేట్‌తో పాటు ఆయా నియోజకవర్గాల్లోని ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నిరసన ర్యాలీలు, మానవహారం, ఆందోళనలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. టీడీపీ కీలక నేతలే నిందితులుగా ఉన్న నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, నకిలీ మద్యం కుటీర పరిశ్రమలను, బెల్టు షాపులను అరికట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్యకు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం, బెల్టు షాపులను అరికట్టాలని, నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, అబద్ధానికి అధికారమిస్తే ప్రజలకు మిగిలేది కష్టాలు, నష్టాలేనని, దీనికి కూటమి ప్రభుత్వమే ఉదాహరణని అన్నారు. అబద్ధాలను వండి వార్చడమే చంద్రబాబు లక్షణమన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల ముందు మద్యం తాగాలంటూ ప్రమోట్ చేసిన నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, గిరిజాల బాబు, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.