యానాం: స్థానికంగా శనివారం రాత్రి అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఆ వివరాల ప్రకారం.. నిత్యం వాహన రాకపోకలతో కిటకిటలాడే యానాం పద్మా థియేటర్ జంక్షన్ వద్ద ఓ వ్యక్తిని బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడవడంతో ఘటనా స్థలంలోనే అతను కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. మృతుడు కాజులూరు మండలం సుబ్బారాయుడు వీధికి చెందిన తిపురశెట్టి నారాయణస్వామి (45)గా పోలీసులు గుర్తించారు. అతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడని తెలిపారు. అతని మృతదేహాన్ని ఎస్సైలు పునీత్‌రాజ్, కట్టా సుబ్బరాజు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
హత్యకు ప్రతీకారమా?
2022 మార్చి 12న మోకా వెంకటేశ్వరరావు (బుజ్జి) యానాం గోపాల్‌నగర్ శివారు మోకా గార్డెన్స్‌లో తన ఇంటి వద్దే హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా శనివారం రాత్రి హత్యకు గురైన తిపురశెట్టి నారాయణసామి ఉన్నాడు. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది. నారాయణసామి కొన్నేళ్లపాటు పుదుచ్చేరి కాలాపేట జైలులో శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడని, ఆ విధంగా యానాం పోలీస్ స్టేషన్‌లో రోజూ సంతకం పెడుతున్నాడని తెలిసింది. వెంకటేశ్వరరావు హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగిందా.. వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాత కక్షలే కారణమంటున్న స్థానికులు