● చేప.. చిక్కిందోచ్‌ | - | Sakshi
Sakshi News home page

● చేప.. చిక్కిందోచ్‌

Oct 12 2025 7:10 AM | Updated on Oct 12 2025 7:10 AM

● చేప

● చేప.. చిక్కిందోచ్‌

చేపలను పట్టేందుకు కొత్త ఎత్తుగడ ఇది.. వల, గేలం వేయకుండానే మత్స్యకారులు ప్లాస్టిక్‌ బాటిళ్లు, మైదాతో చేపలను చేజిక్కించుకుంటున్నారు. ఉప్పాడ, అమీనాబాదు తీర ప్రాంతాల సమీపంలోని ఉప్పుటేరు, పెదయేరులో మత్స్యకారులు మైదా పిండిని ఎరవేసి చేపలను పట్టేస్తున్నారు. మత్స్యకారులు ఈ కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. రెండు లీటర్ల వాటర్‌ బాటిల్‌ అడుగు భాగంలో కోసి నీటిలో మునిగే విధంగా బరువైన వల పూసలను కట్టి బాటిల్‌ను తయారు చేస్తున్నారు. దానికి పొడవైన ధారం అమర్చుతున్నారు. ఆ బాటిల్‌లో నీటిలో కలిపిన మైదా పిండిని వేసి ఉప్పుటేరులో విసురుతున్నారు. మైదా పిండిని తినేందుకు చేప బాటిల్‌లోకి వచ్చి ఇరుక్కోగానే ధారాన్ని లాగుతున్నారు. దీనిద్వారా సుమారు కిలో నుంచి రెండు కిలోల వరకూ కట్ట చేపలు పడుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు.

– కొత్తపల్లి

● చేప.. చిక్కిందోచ్‌ 1
1/1

● చేప.. చిక్కిందోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement