
గత ప్రభుత్వానికి పేరొస్తుందనే అక్కసు
పేదలందరికీ సొంతిల్లు ఉండాలన్నది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం. అది కూడా నివాసయోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో జగనన్న కాలనీల్లో అన్ని రకాల వసతులూ కల్పించాం. ఎక్కడో కాకుండా రూ.కోట్లు వెచ్చించి గ్రామాలకు సమీపంలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇళ్లు కాకుండా కొత్తగా ఊళ్లు నిర్మించాం. మా ప్రభుత్వ హయాంలోనే అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. గృహ నిర్మాణాలు పూర్తయితే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం చూపుతోంది. ఉన్న వసతులు మెరుగుపరచాల్సింది పోయి వాటిని నాశనం చేస్తోంది. చివరకు ట్రాన్స్‌ఫార్మర్లు సైతం పట్టుకుపోతున్నారంటే పేదలపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న కాలనీల్లో వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే