
ఆటోను అటకాయించి దాడి
రాయవరం: వేకువజామున ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కొందరు వ్యక్తులు అటకాయించి, దాడి చేసినట్టు కేసు నమోదు చేశామని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు, మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణారావు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం వేకువజామున 3.30 సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న వారిని ఆటో ఎక్కించుకునేందుకు మాచవరం వంతెన వద్దకు వచ్చాడు. ప్రయాణికులను ఎక్కించుకుని వి.సావరం వెళ్తున్న సమయంలో సోమేశ్వరం గ్రామం వద్ద అదే గ్రామానికి చెందిన శాకా వినయ్‌వంశీ ఆటోను అడ్డగించాడు. డ్రైవర్‌ౖ రామకృష్ణపై దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న ప్రయాణికురాలు అన్నపూర్ణపై కూడా దాడికి పాల్పడ్డాడు. వంశీతో పాటు, మరో ముగ్గురు కలిసి డ్రైవర్ రామకృష్ణ, అన్నపూర్ణతో దురుసుగా ప్రవర్తించారు. దాడికి గురైన రామకృష్ణ అనపర్తి ఆస్పత్రిలో చేరగా, ఆటోలో ప్రయాణిస్తున్న వారు మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై హెచ్‌సీ వీర్రాజు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దొరరాజు తెలిపారు.
భయంతో వణికిపోయాం
రాయవరం పోలీస్‌స్టేషన్ వద్ద బాధితులు చింతపల్లి సత్యసాయి ప్రసన్న, అనుసూరి కీర్తన, అనుసూరి అన్నపూర్ణ, అనుసూరి శ్రీను తమ గోడును వెళ్లబోసుకున్నారు. శ్రీను, అన్నపూర్ణ, వారి కుమార్తెలు సత్యసాయిప్రసన్న, కీర్తనతో కలిసి హైదరాబాద్ నుంచి బస్సు దిగి మాచవరం వంతెన వద్ద ఆటో కోసం వేచిచూస్తున్న సమయంలో వినయ్‌వంశీ, మరో ముగ్గురు తమ వాహనంలోకి రావాలని అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ఈలోగా ఆటో రావడంతో, అందులో ఎక్కి వెళుతుండగా ఆ నలు గురూ వెంబడించి, ఆటోను అడ్డగించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అంతేకాకుండా అన్నపూర్ణపై వంశీ దాడి చేసి కొట్టాడన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
డ్రైవర్, ప్రయాణికులపై దురుసు ప్రవర్తన