
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 25 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట తదితర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు కూడా పాల్గొన్నారు.
సారాపై ఫిర్యాదులకు
14405 కాల్ సెంటర్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 14405 నంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయన్నారు. ఎకై ్సజ్, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సారా నిర్మూలనకు జిల్లాలో 19 మండల స్థాయి, 240 గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమం కింద ఇప్పటివరకు 313 అవగాహన సమావేశాలు నిర్వహించామని, 63 మంది దత్తత అధికారులను నియమించామని జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్య తెలిపారు. కలెక్టర్ కీర్తి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి లావణ్య, ఇతర అధికారులు కలిసి నవోదయం 2.0 – 14405 కాల్ సెంటర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఆర్‌డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేడు జెడ్పీ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని కోరారు.

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 25 ఫిర్యాదులు