
దండెత్తిన దళితులు
రూ.5 వేల కోట్లు
పెట్టలేరా బాబూ?
పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కూటమి సర్కారు కుట్ర పన్నుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.8,500 కోట్లు వెచ్చించి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టారు. వీటి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టింది. మిగిలిన కళాశాలలకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే నిర్మాణ పనులు పూర్తయి, పేదలకు వైద్య విద్య అందుతుంది. కూటమి నేతల బినామీల భూములకు రేట్లు పెంచేందుకు అమరావతిలో రూ.లక్ష కోట్ల అప్పు చేస్తోంది. ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దుతోంది. కానీ, పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు అప్పు చేసి ఖర్చు పెట్టలేకపోవడమేమిటి? 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు టెండర్లు పిలవడం పేదవాడికి వైద్యాన్ని దూరం చెయ్యడమే.
– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే,
కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు.. పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు ఆధ్వర్యాన.. రాజమహేంద్రవరం నగరంలోని గోకవరం బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో నేతలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎవరి మొరా ఆలకించడం లేదని.. మీరైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగించాలని అంబేడ్కర్ విగ్రహానికి వేడుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, ఇతర నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పీపీపీ విధానం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కార్యక్రమంలో తాళ్లపూడి ఎంపీపీ ముప్పిడి పోసిరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా శ్రీను, లీగల్ సెల్ కన్వీనర్ కవలల నాగేశ్వరరావు, దాసి వెంకటరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆరే శ్రీను, రాజానగరం అధ్యక్షుడు గొంతు లక్ష్మణరావు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరికిమల్లి చిన్న, అనపర్తి చంటి తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ వైద్య కళాశాలల
ప్రైవేటీకరణపై ఆగ్రహం
ఫ వైఎస్సార్ సీపీ
ఎస్సీ సెల్ ఆధ్వర్యాన నిరసన
ఫ అంబేడ్కర్ విగ్రహానికి వినతి
ఫ నిర్ణయం ఉపసంహరించుకునేంత
వరకూ ఉద్యమిస్తామని హెచ్చరిక
తాబేదారులకు కట్టబెట్టేందుకే..
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వెనుక వేరే మతలబు దాగుంది. పెత్తందార్లు, వారి తాబేదార్లకు కట్టబెట్టేందుకే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెర పైకి తీసుకొచ్చింది. ప్రభుత్వాలు పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. రాజ్యాంగం సైతం అదే స్పష్టం చేస్తోంది. వాటిని కూటమి సర్కారు విస్మరిస్తోంది. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. గుత్తేదారులకు సంపద సృష్టించి పెడుతున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి వైద్య కళాశాలలు తీసుకొస్తే.. కూటమిలో ఉన్న చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరించడం దారుణం. బడుగు బలహీన వర్గాలు బాగు పడకూడదన్నదే చంద్రబాబు అజెండా.
– నక్కా శ్రీనగేష్, రాష్ట్ర కార్యదర్శి,
రాజమండ్రి రూరల్ పరిశీలకుడు

దండెత్తిన దళితులు

దండెత్తిన దళితులు

దండెత్తిన దళితులు