
మళ్లీ గోదావడి
ధవళేశ్వరం: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ఉరకలెత్తుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం నుంచీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 6 గంటలకు 12 అడుగులుగా ఉన్న నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ రాత్రికి 12.60 అడుగులకు చేరింది. 10,96,937 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. వరద ఉధృతి బుధవారం మరింత పెరిగి, రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి సమీపానికి నీటిమట్టం చేరుకునే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, ఎగువన భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నాయి. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
కాళేశ్వరం 12.55
పేరూరు 16.78
దుమ్ముగూడెం 13.64
భద్రాచలం 50.30 (అడుగులు)
కూనవరం 19.65
కుంట 10.72
పోలవరం 12.33
రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.39
ఎగువన గోదావరి
నీటిమట్టాలు (మీటర్లలో)