
ఇదేనా సంపద సృష్టి?
అధికారంలోకి రాక ముందు సంపద సృష్టిస్తా, పేద ప్రజలకు పంచుతా.. అని హామీలిచ్చిన చంద్రబాబు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే వైద్య కళాశాలలను ప్రైవేటు రంగానికి కట్టబెట్టి వారికే సంపద సృష్టిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గపు చర్య. మాజీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తాం. గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజల మద్దతు కూడగట్టి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ అవిశ్రాంత ఉద్యమాలు చేపడతాం.
– తిరగట్టి దుర్గారావు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు, రాజమహేంద్రవరం