
జాతీయ యోగాలో దేవాన్ష్‌కు రజతం
తుని: స్థానిక శ్రీప్రకాష్ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్న బండారు దేవాన్ష్ నాయుడు అండర్ 17 వ్యక్తిగత జాతీయ యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం గెలుపొందినట్టు విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ గురువారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 16 వరకు హర్యానా రాష్ట్రం కర్నాల్ పట్టణంలో జాతీయ స్థాయి యోగా పోటీలు జరిగాయన్నారు. తమ విద్యార్థి రజత పతకం సాధించడం గర్వకారణమన్నారు. జాతీయస్థాయిలో ప్రతిభకనబర్చిన దేవాన్ష్ నాయుడిని విద్యా సంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.అరుణ, యోగా గురువు సురేష్ అభినందించారు.