
నూతన కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని ఆమె కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జి ల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, సమన్వయంతో కలసి ముందుకు సాగి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, పరిపాలనలో పారదర్శకత, శీఘ్ర స్పందన, ప్రజలతో నేరుగా మమేకమయ్యే విఽ దానాలు, జిల్లా అభివృద్ధి, ప్రాధాన్య అంశాలపై చర్చి ంచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్.రాహుల్, కూడా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రుడా పరిధిలో ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులు, పరిపాలనాపరమైన అంశాలు, గోదావరి పుష్కరాలకు ప్రతిపాదించిన పనులపై చర్చించారు.

నూతన కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ