సంరక్షణతో దినదినాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సంరక్షణతో దినదినాభివృద్ధి

Sep 15 2025 8:39 AM | Updated on Sep 15 2025 8:39 AM

సంరక్

సంరక్షణతో దినదినాభివృద్ధి

చూడి కట్టే వరకూ జాగ్రత్తలే మేలు

ఈతకు ఈతకు మధ్య వ్యవధి తగ్గించాలి

ఆరోగ్యకరమైన దూడలతో

అధిక పాల దిగుబడి

ఆలమూరు: పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సమతుల పోషకాహారాన్ని అందించడం, సమీకృత దాణాను అందుబాటులో ఉంచడం, యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశుగణం దినదినాభివృద్ధి చెందుతుంది. పశువులకు దూడలు జన్మించిన నాటి నుంచి యుక్తవయసు వచ్చి సంపర్కం జరిగి చూడి కట్టే వరకూ పాడిరైతులు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈతకు ఈతకు మధ్య వ్యవధిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన దూడలతో పాటు అధిక పాల దిగుబడి ఆశించవచ్చు. సాధారణంగా ఉత్తమజాతి ఆవు కాని గేదె కాని 300 రోజుల పాటు ఏకధాటిగా పాలిస్తుంది. అనంతరం ఆ పశువు పాల ఉత్పత్తి కొంచెం కొంచెం మందగించి చివరకు వట్టిపోయే దశకు చేరుకుంటుంది. దీనివల్ల పాడి పశువులకు ఈత మధ్య ఎడం తగ్గించడం ద్వారా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాడి పశువు వట్టిపోయే కాలం తగ్గిపోవడంతో పాడి రైతుకు కొంత ఉపశమనం కలుగుతుంది.

సకాలంలో చూడి పరీక్షలు చేయించాలి

గేదె ఈనిన మూడు నుంచి నాలుగు నెలల్లోపు చూడి కట్టించడం ద్వారా పశువు వట్టిపోయే లోపు మళ్లీ ఈతకు వచ్చి పాల దిగుబడినిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల పశువు వట్టిపోయే కాలం అసాధారణంగా తగ్గుతుంది. ఒక మేలుజాతి పశువు పాలిచ్చే సమయంలో ఆరోగ్యకరమైన దూడల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. చూడి పరీక్షలు సకాలంలో చేయించడం, సమీకృత దాణా గాని పచ్చగడ్డితో కాని పశువులను మేపడం ద్వారా ఈత వ్యవధి తక్కువైనా పశువుల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం పడే అవకాశం లేదు. పాడి పశువుల్లో జననేంద్రియ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది పునరుత్పత్తి జరపగలిగే విధంగా విడుదల చేసే అండాన్ని థను ప్యూబర్టీ (యుక్త వయసు) అంటారు. దేశవాళీ పశువుల కంటే సంకర జాతి పశువులు త్వరితగతిన యుక్తవయస్సుకు రావచ్చు. అలాగే యుక్త వయస్సుకు రాని పశువులను మేపుట వల్ల రైతుకు భారంగా ఉంటుంది. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు పశువుల్లో యుక్త వయసుకు రాగానే చూడి కట్టించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీంతో ప్రతి పాడి పశువు ఏడాదికి ఒక దూడకు జన్మనివ్వడం సులభతరమవుతుంది. దీనిద్వారా పశువుల జీవితకాలంలో జన్మించే పశువుల సంఖ్య పెరగడం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చని ఆలమూరు పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు ఎల్‌.అనిత చెబుతున్నారు.

పశువు వయసును బట్టి శరీర బరువు ఉండాలి

యుక్త వయసును ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానంగా పశువు శరీర బరువు, పెయ్య దూడల పరిపక్వత వాటి వయసు కంటే కూడా శరీర బరువు మీద ఎక్కువశాతం ఆధారపడి ఉంటుంది. సహజంగా సరైన బరువు ఉన్న పశువులు లేదా తక్కువ బరువు కలిగిన పశువులు త్వరగా యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంది.

వాతావరణ ప్రభావం కీలకమే..

పశువుల్లో యుక్త వయసును ప్రభావితం చేసే కాలానుగుణ, ప్రకృతిపరమైన అంశాల్లో ఋతువు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పాడి పశువుల్లో శీతాకాలం లేదా శరదృతువు అనేది యుక్త వయసు ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. వసంత ఋతువు లేదా వేసవిలో పుట్టిన పెయ్యల కంటే శీతాకాలంలో జన్మించిన పెయ్య దూడలు ఏడు నెలల వయసు వచ్చేటప్పటికి వేసవిలో సంభవించే ఉష్ణ్రోగ్రత వల్ల సూర్యకాంతి ప్రసరణ జరిగి కౌమారదశకు చేరుకున్న పశువులు ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది.

సంరక్షణతో దినదినాభివృద్ధి1
1/2

సంరక్షణతో దినదినాభివృద్ధి

సంరక్షణతో దినదినాభివృద్ధి2
2/2

సంరక్షణతో దినదినాభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement