
గుండెపోటుతో ఉద్యోగి మృతి
దేవరపల్లి: మండలంలోని యర్నగూడెం బొల్లిన గంగరాజు జెడ్పీ హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.వీరభద్రం(42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. నల్లజర్ల మండలం దూబచర్లలో నివాసం ఉంటున్న వీరభద్రంకు ఛాతీలో నొప్పి రావడంతో కటుంబ సభ్యులు నల్లజర్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరభద్రం మృతి చెందినట్టు నిర్ధారించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు..
తొండంగి: మండలంలోని కృష్ణాపురం వెళ్లే రహదారిలో బైకు అదుపుతప్పి విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై జగన్మోహన్‌రావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాపురం శివారులో అవంతి రొయ్యల పరిశ్రమలో విజయనగరం జిల్లా బోడంగి మండలం రాజేరు గ్రామానికి చెందిన పోతాబత్తుల చరణ్‌కుమార్ (20) డైలీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సెలవు పెట్టి బైకుపై కృష్ణాపురం వస్తుండగా ఓ ప్రైవేటు స్కూలు వద్దకు వచ్చే సరికి బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రగాయాలై అపస్మారకస్థితికి చేరుకోవడంతో అంబులెన్స్‌లో తుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.