
మార్కెట్‌లోకి హోండా షైన్ 100 డీఎక్స్
కంబాలచెరువు: రాజమహేంద్రవరం మై హోండా షోరూమ్‌లో హోండా షైన్ 100 డీఎక్స్ కొత్త బైక్‌ను సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ వాహనం అందుబాటులోకి వచ్చిందని హోండా కంపెనీ స్టేట్ హెడ్ శరద్‌ఉండ్రే, ఏరియా సేల్స్ మేనేజర్ రక్షిత్, షోరూమ్ జీఎం ఎం.కోటేశ్వరరావు తెలిపారు. హోండా షైన్ 100 డీఎక్స్ అత్యధిక మైలేజీ ఇచ్చే విధంగా తయారైందన్నారు. దీనితో పాటు వాహనానికి డిజిటల్ మీటర్, ట్యూబ్ లెస్ టైర్, హెన్‌హేస్‌డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ వంటివి ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు వచ్చి వాహనం టెస్ట్ డ్రైవ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు.