
భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
బిక్కవోలు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన వ్యక్తి కాలువలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం బిక్కవవోలులో జరిగింది. ఎస్సై వి.రవిచంద్ర కథనం ప్రకారం.. బిక్కవోలుకు చెందిన కుందేటి రవికుమార్‌కు సోనితో వివాహం జరిగింది. భర్తపై కోపంతో తన అమ్మ ఇళ్లయిన మండపేటకు సుమారు 3 నెలల క్రితం వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో రవికుమార్ స్థానిక బ్రిడ్జి పైనుంచి అందరూ చూస్తుండగా సామర్లకోట కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అదే మార్గంలో వెళ్తున్న ఎస్సై రవిచంద్ర కుమార్, ఆయన ప్రైవేట్ డ్రైవర్ గణేష్ కలసి వెంటనే కాలువ వద్దకు వెళ్లి చెట్టుకు వేలాడుతున్న అతనిని నీటిలో పడకుండా కాపాడారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్సై వివరించారు.