
కొత్త కార్యవర్గం ఎన్నిక
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఎన్జీఓ హోమ్‌లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. మూడేళ్ల కాల పరిమితికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కేజీకే మూర్తి, జనరల్ సెక్రటరీగా కర్రి లక్ష్మీనరసింహరెడ్డి (కేఎల్‌ఎన్ రెడ్డి), కోశాధికారిగా పామర్తి గోపాలరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎండీ అక్బర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ జార్జిలతో కూడిన కార్యవర్గం ఎన్నికై ంది. వీరితో పాటు జిల్లాలోని వివిధ యూనిట్ల నుంచి ఎన్నికై న ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.