
అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ
ఫ 9న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం
ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9న రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద శ్రీఅన్నదాత పోరుశ్రీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ శ్రేణులతో కలసి శ్రీఅన్నదాత పోరుశ్రీ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. దీనిపై మాట్లాడితే కేసులు బనాయిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులపై కక్ష సాధిస్తుందని వేణు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని, విద్యుత్ ఉద్యమంలో రైతులను కాల్చి చంపించాడని, 2014–19 పాలనలో రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశాడన్నారు. ఈ మధ్యకాలంలో ధాన్యం పండించవద్దని, వరి వేయవద్దని ప్రకటనలు చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏనాడూ రైతులకు ఎరువుల కొరత లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం, మిర్చి, పొగాకు, మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారన్నారు.
మిర్చి, పొగాకు రైతుల వద్దకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శకు వెళ్లిన తర్వాతే కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇప్పుడు ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. పండించిన పంటకు సరైన సమయంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచి యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుందన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 9న రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు రాజమహేంద్రవరం రూరల్, సిటీ, అనపర్తి, రాజానగరం రైతులు, పార్టీ శ్రేణులు, కొవ్వూరు డివిజనల్ కార్యాలయం వద్ద కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల రైతులు, పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల వీర్రాజు(బాబు), నక్కా శ్రీనగేష్, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్రస్టాలిన్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికారి ప్రతినిధి ఎంఎం ఆలీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగాడి సత్యప్రియ, జిల్లా మహిళా విభాగ అధ్యక్షరాలు మార్తి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్, జిల్లా కార్యదర్శులు యెనుముల త్యాగరాజు, ముద్దాల అను, వివిధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు చీకురుమిల్లి చిన్న, చెరుకూరి సత్యనారాయణ, పెనుమాక సునీల్, చింతపర్తి రాంబాబు, హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు.