
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెం
నిడదవోలు (ఉండ్రాజవరం): వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బారావు ఎంపికయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురిని నియమిస్తూ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఆది వారం ఉత్తర్వులు ఇచ్చింది. బూరుగుపల్లి సుబ్బారావు గతంలో పశ్చిమ, తూర్పు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌గా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకూ ఎంపీటీసీ సభ్యుల ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలకు రైతు విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానన్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.