పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌

Sep 1 2025 3:15 AM | Updated on Sep 1 2025 3:15 AM

పెట్ట

పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌

‘ఉమ్మడి’లో 30 వేల సీపీఎస్‌ ఉద్యోగులు

నేడు విజయవాడలో మహా సభ

రాయవరం: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో చనిపోతే కుటుంబానికి తోడ్పాటు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగికి సామాజిక భద్రతగా పెన్షన్‌ ఉంటుందనేది ఒకప్పటి మాట. సీపీఎస్‌ ఉద్యోగులకు మాత్రం ఈ మేరకు భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో.. పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌ దశాబ్ద కాలంగా వినిపిస్తోంది. సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వివిధ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక(ఫ్యాఫ్టో) ఇప్పటికే మద్దతు పలికింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ ఉద్యోగులు కలిపి 30 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులున్నారు. పదవీ విరమణ అనంతరం అందించే పింఛన్లు భారమవుతుందని భావించి 2003–04 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) విధానం అమలు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) పేరుతో అమల్లోకి తీసుకొచ్చింది. 2004 సెప్టెంబర్‌ ఒకటి నుంచి సీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏటా సెప్టెంబర్‌ ఒకటిన పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తున్నారు.

నేడు విజయవాడలో మహాసభ

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్‌ ఉద్యోగులు సోమవారం విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు వెళ్లే వారిపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఐదు వేల మంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

మాట నిలబెట్టుకోవాలి

సీపీఎస్‌ ఉద్యోగుల పోరాటం ద్వారా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్ష న్‌ సాధించుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగి హక్కుగా ఉన్న సర్వీస్‌ పెన్షన్‌ సాధించుకోవడమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకూ మా పోరాటాన్ని దశలవారీగా ఉధృతం చేస్తాం. – చింతా నారాయణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,

ఏపీసీపీఎస్‌ఈఏ, కాకినాడ

తీవ్రంగా నష్టపోతున్నాం

సీపీఎస్‌ విధానం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగికి ప్రాథమిక హక్కులైన పెన్షన్‌, సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్‌ విధానం వల్ల రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది.

– గుబ్బల శ్రీనివాస్‌, రాష్ట్ర కౌన్సిలర్‌, ఏపీసీపీఎస్‌ఈ అసోసియేషన్‌, అంతర్వేది, సఖినేటిపల్లి మండలం

పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌ 1
1/2

పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌

పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌ 2
2/2

పెట్టుబడి పెన్షన్‌.. బతుకు టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement